News January 23, 2025

HYD: సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు

image

తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు విధించారు. ఇకపై సచివాలయం లోపలికి వెళ్లే వారికి ఇచ్చే పాస్‌తో ఒక్కరినే అనుమతించనున్నారు. గతంలో విజిటర్స్ సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే 6వ అంతస్తులోకి విజిటర్స్ అనుమతి నిరాకరించారు. మంగళవారం సీఎస్ ఫ్లోర్‌లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో ఎస్పీఎఫ్ సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News December 5, 2025

అచ్చంపేట: విలీన గ్రామాల్లో ‘పంచాయతీ’ సందడి

image

అచ్చంపేట, బల్మూరు మండలాలకు చెందిన పల్కపల్లి, లింగోటం, నడింపల్లి, పుల్జాల, లక్ష్మాపూర్, గుంపన్పల్లి, చౌటపల్లి పోలిశెట్టిపల్లి గ్రామపంచాయతీలను 2018లో అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. ప్రజల నిరసనలతో మళ్లీ విలీన ప్రక్రియను రద్దు చేసిన ఈ గ్రామాలు నోటిఫై కాకపోవడంతో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు ఆయా గ్రామాలు నోటిఫై కావడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

News December 5, 2025

ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

image

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.

News December 5, 2025

నల్గొండ: సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

image

కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బోయపల్లి అనూష(21) పోటీ చేస్తున్నారు. అనూష తండ్రి బోయపల్లి జానయ్య గతంలో ఉమ్మడి చర్ల గౌరారం ఎంపీటీసీగా పనిచేశారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అనూష తెలిపారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు వస్తుందని ఆమె ఆకాంక్షించారు.