News April 13, 2025
HYD: సన్నబియ్యంతో ‘బ్లాక్’కు చెక్..!

ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడంతో RR జిల్లాలో పలు మండలాల్లో PDS బియ్యం బ్లాంక్ దందాకు గండి పడిందని స్థానికులు అనుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో చాలా మంది రేషన్షాపులకు వచ్చేవారు కాదని, బియ్యం తీసుకున్నా.. బ్లాక్లో అమ్మేవారని చర్చించుకుంటున్నారు. అలా మిగిలిన బియ్యం కొన్ని చోట్ల రేషన్ డీలర్లే అమ్ముకునేవారు అని గుసగుసలు వినపడుతున్నాయి.
Similar News
News December 24, 2025
బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు

భారత్-బంగ్లా సంబంధాలు మరింత బలహీనమవుతున్నాయి. బంగ్లాలోని భారత దౌత్యవేత్తకు ఆ దేశం సమన్లు జారీ చేసిన గంటల వ్యవధిలోనే భారత్లోని BAN దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాకు MEA సమన్లు ఇచ్చింది. వారం వ్యవధిలో ఇది రెండోది. నిన్న హమీదుల్లాను పిలిపించి హాదీ మరణానంతరం బంగ్లాలోని భారత హైకమిషనర్ల వద్ద జరుగుతున్న పరిణామాలపై చర్చించి ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే ఇరుదేశాలు వీసా సర్వీసులను నిలిపేశాయి.
News December 24, 2025
డిసెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

✒ 1924: లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ జననం(ఫొటోలో)
✒ 1956: నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
✒ 1987: తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం
✒ 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రారంభించిన ప్రధాని వాజ్పేయి
✒ 2005: ప్రముఖ నటి భానుమతి మరణం
✒ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
News December 24, 2025
సీఎం చంద్రబాబును కలిసిన పూల నాగరాజు

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు మంగళవారం సెక్రటేరియట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


