News July 2, 2024

HYD: సబిత ఫ్లెక్సీ దహనం.. PSలో ఫిర్యాదు

image

మహేశ్వరంలో MLA సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీ‌ని దిష్టిబొమ్మ‌గా తయారుచేసి కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ మహేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక PSలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని సబిత స్పష్టం చేసినా.. పలువురు INC నేతలు చేర్చుకోవద్దని ధర్నా చేయడం‌ గమనార్హం. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 20, 2025

‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్‌‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.

News November 19, 2025

ప్రణాళికలు సిద్ధం చేసుకుని చీరలు పంపిణీ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. చీరల పంపిణీ కార్యక్రమం విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారిని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News November 19, 2025

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.