News August 19, 2024
HYD: సమస్యలపై మహిళా కమిషన్ వద్దకు జూడాలు

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
Similar News
News February 25, 2026
HYD: బుక్స్‌ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్‌గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.
News February 25, 2026
HYD: నలుపెక్కిన నగరం.. వర్ష సూచన

HYDలో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను నల్లని మబ్బులు కమ్మేయగా, చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఎండగా ఉన్నప్పటికీ ప్రయాణాలను పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. మీ ఏరియాలో వర్షం పడుతుందా?
News February 25, 2026
HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.


