News September 2, 2024

HYD: సమస్యలుంటే కాల్ చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.
◆హైదరాబాద్ కలెక్టరేట్ 040-23202813, 9063423979.
◆హైదరాబాద్ ఆర్డీవో : 7416818610
◆జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111
◆హైడ్రో కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667
◆సికింద్రాబాద్ ఆర్డీఓ 9985117660, 8019747481

Similar News

News November 26, 2025

రేపు BRS హైదరాబాద్ కీలక సమావేశం

image

BRS హైదరాబాద్ జిల్లా కీలక సమావేశం రేపు (గురువారం) జరుగనుంది. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారని తలసాని తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ వేడుకల గురించి సమావేశంలో చర్చించనున్నారు.

News November 26, 2025

HYD: త్వరలో కొత్త బస్ డిపోలు.. ప్రతిపాదించిన ఆర్టీసీ

image

మహానగరం విస్తరించనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచి అదనపు డిపోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం గ్రేటర్లో 25 డిపోల పరిధిలో 3,100 బస్సులు సేవలందిస్తున్నాయి. బస్సుల సంఖ్యను పెంచి మరో 16 డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుందని సమాచారం.

News November 26, 2025

మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

image

గ్రేటర్‌లో మున్సిపాల్టీల విలీనం తరువాత  HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.