News January 28, 2025
HYD: సమస్య పరిష్కారం కాకుంటే రంగంలోకి దిగుతా: రంగనాథ్

నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసేందుకు ప్రజలు హాజరయ్యారని, ఆయా ఫిర్యాదులకు సంబంధించిన రెండు వారాల్లో అధికారులు ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి విచారణ చేపడతారన్నారు. 78 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయని తెలిపారు.
Similar News
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్లో ఉద్యోగాలు..

<
News December 7, 2025
జనగామ: గుర్తులు ఖరారు!

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.


