News January 28, 2025
HYD: సమస్య పరిష్కారం కాకుంటే రంగంలోకి దిగుతా: రంగనాథ్

నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసేందుకు ప్రజలు హాజరయ్యారని, ఆయా ఫిర్యాదులకు సంబంధించిన రెండు వారాల్లో అధికారులు ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి విచారణ చేపడతారన్నారు. 78 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయని తెలిపారు.
Similar News
News March 12, 2025
HYD: అమ్మా..నాన్నా.. మేం చనిపోతున్నాం! (లెటర్)

హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
News March 12, 2025
HYD: భగ్గుమంటున్న ఎండ.. రెండ్రోజులు జాగ్రత్త!

ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.
News March 11, 2025
HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.