News April 10, 2024

HYD: సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలి: డిప్యూటీ సీఎం

image

హైటక్ సిటీ ట్రీడెంట్ హోటల్లో జరిగిన గీతాంజలి మళ్లి వచ్చింది సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కోన వెంకట్ ఆధ్వర్యంలో వెలువడిన గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నాడు సినిమాలు సామాజిక బాధ్యత, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే విధంగా పాత్రలు ఉండేవని, సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలని పేర్కొన్నారు.

Similar News

News January 19, 2025

HYD: OYO బంద్ చేయాలని డిమాండ్

image

OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News January 18, 2025

HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి

image

సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. 

News January 18, 2025

RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!

image

ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది.