News April 11, 2024
HYD: సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఇవే..!

వేసవి వేళ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. HYD నుంచి కటక్ ఏప్రిల్ 16, 23, 30న, సికింద్రాబాద్ నుంచి ఉదయ్‌పూర్ ఏప్రిల్ 16, 23 తేదీలలో రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. రిటర్న్ జర్నీకి సైతం అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
HYD: 500 మందిని ఉరితీసింది ఇక్కడే

‘కాలాపానీ’ అనగానే అండమాన్ గుర్తుకొస్తుంది. కానీ దాని రూపకల్పనకు మన HYDలోని ఓ జైలు ఆధారమైందన్న విషయం చాలామందికి తెలియదు. దీనిని సికింద్రాబాద్ తిరుమలగిరిలో 1858లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. 20,344 గజాల విస్తీర్ణంలో పచ్చీస్ ఆకారంలో, 75 చీకటి గదులతో ఈ కారాగారాన్ని కట్టించారు. ఇందులో 500 మందికిపైనే ఉరేశారు. 1994 వరకు జైలుగా వినియోగించారు. దీనినే నమూనాగా తీసుకుని 1906లో ‘కాలాపానీ’ని నిర్మించారు.
News January 22, 2026
HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.
News January 22, 2026
HYD: మేడారం వెళ్తున్నారా..? 7658912300కి ‘HI’ పెట్టండి

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ


