News December 13, 2024

HYD: సరస్వతీ నది పుష్కరాలపై మంత్రి సమీక్ష

image

సచివాలయంలో సరస్వతీ నది పుష్కరాల నిర్వహణకు సంబంధించి సమీక్షా సమావేశం దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించారు.  ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణా రావు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

HYD: IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్

image

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్‌సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

News July 11, 2025

GHMCలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

image

GHMCలో డిప్యూటీ కమిషనర్‌లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లు పొందారు.

News July 11, 2025

HYD: AI డేటా సైన్స్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.