News November 8, 2024
HYD: సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి: సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహణపై సీఎస్ ప్రత్యేకాధికారులతో HYD సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. శాంతికుమారి మాట్లాడుతూ.. ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈనెల 9 నుంచి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.
Similar News
News December 4, 2024
HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు
రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.
News December 4, 2024
HYD: గవర్నర్‌ను కలిసిన మంత్రులు
రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదిన ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
News December 4, 2024
HYD: దివ్యాంగులకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
రవీంద్రభారతిలో జ్యోతి వెలిగించి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు.