News October 25, 2024
HYD: సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్,ఈ-ఇన్-సీ అనిల్, చీఫ్ ఇంజినీర్లతో కలిసి శుక్రవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
Similar News
News November 17, 2025
HYD: GOOD NEWS 45 రోజులు ఫ్రీ ట్రెయినింగ్

మేడ్చల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ట్రెయినింగ్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో బ్యాచ్లో 30 మందిని ఎంపికచేసి 45 రోజులపాటు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. దీంతో యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. శామీర్పేట పాత GP భవనంలో NCP కేంద్రం ఏర్పాటు చేయగా, దీనికి రూ.60లక్షలు విడుదల చేశారు. మరిన్ని వివరాలకు కేంద్రాన్ని సంప్రదించండి.
News November 17, 2025
HYD: మహిళలు.. దీనిని అశ్రద్ధ చేయకండి

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో కణతి చేతికి తగలడం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రవాలు కారటం, చొట్టబడి లోపలికి పోవడం, ఆకృతిలో మార్పు, గజ్జల్లో వాపు లాంటివి కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళ మామోగ్రామ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం మంచిదని MNJ ప్రొ.రఘునాథ్రావు తెలిపారు.
News November 17, 2025
HYD: ఈ ఏరియాల్లో మొబైల్స్ మాయం!

నగరంలోని రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెప్ప పాటు క్షణాలలో దొంగలు సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్నారు. సిటీ పరిధిలో నిత్యం 30-40 మొబైల్ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.SHARE IT


