News November 21, 2024

HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

image

బిల్డింగ్‌పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మైండ్ స్పేస్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నవీన్ రెడ్డి (24) పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 13వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

image

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.

News March 13, 2026

HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

image

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.

News March 13, 2026

గ్యాస్ కొరత.. అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

image

ఇరాన్‑ యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరతపై సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ సప్లై ఉండగా, ప్రస్తుత నిల్వలు, సరఫరా ఇబ్బందులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.