News April 5, 2024

HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ARREST

image

HYD రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బండ్లగూడ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయచంద్‌ వద్ద 15 గ్రాముల డ్రగ్స్‌ను మాదాపూర్ SOT టీమ్ సీజ్ చేసింది. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి SOT సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. జయచంద్ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు.

Similar News

News November 20, 2025

రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

image

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

News November 20, 2025

HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

image

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.

News November 20, 2025

HYD: మంత్రి శ్రీహరిని కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని చిన్న శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు.