News April 10, 2025

HYD: సామూహిక సీమంతాల్లో పాల్గొన్న కలెక్టర్

image

హిమాయత్‌నగర్ సెక్టార్‌ బీమా మైదాన్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ‘గర్భిణులకు సరైన పోషకాహారం అత్యవసరం. అంగన్వా డీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. శిశు ఆరోగ్యం దేశ భవిష్యత్తు ఆధారం’ అని కలెక్టర్ పేర్కొన్నారు. DWO అక్కేశ్వరరావు, CDPO కృష్ణ చైతన్య, సూపర్‌వైజర్ బాలా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.

News November 15, 2025

HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

image

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.

News November 15, 2025

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

image

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.