News June 29, 2024

HYD: సాయి చంద్ చిత్రపటానికి కేటీఆర్, హరీశ్ నివాళి

image

HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ‌వేద సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.

Similar News

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

News October 18, 2025

రంగారెడ్డి: నేటితో ముగియనున్న వైన్స్ టెండర్ల స్వీకరణ

image

రంగారెడ్డి జిల్లాలో 138 మద్యం దుకాణాలకు 4,200కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్‌నగర్‌లో 32కి 1,210, హయత్‌నగర్ 28కి 1,400, ఇబ్రహీంపట్నంలో 19కి 350, మహేశ్వరంలో 14కి 530, ఆమనగల్‌లో 17కి 230, షాద్‌నగర్‌లో 28కి 500 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు.

News October 18, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి సాధించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మండలాల వారీ మంజూరైన ఇళ్ల సంఖ్య, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.