News June 29, 2024

HYD: సాయి చంద్ చిత్రపటానికి కేటీఆర్, హరీశ్ నివాళి

image

HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ‌వేద సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.

Similar News

News October 21, 2025

జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

image

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.

News October 21, 2025

HYD: మెట్రో స్వాధీన ప్రక్రియ.. FY 2025-26 ముగింపులోపే కొలిక్కి!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దీనికి ఒక రూపు తేవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా మెట్రో రైల్ ఆర్థిక వ్యవహారాలపై స్టడీ చేయించాలని నిర్ణయించింది. దానికి ఉన్న భూములు, ఆస్తులు, షాపింగ్ మాల్స్ తదితరాల విలువపై దృష్టి సారించింది.

News October 21, 2025

HYD: ‘డిసెంబర్ 6లోపు వక్ఫ్ ఆస్తులు అప్‌డేట్ చేయాలి’

image

సెంట్రల్ వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తేదీలోపు వక్ఫ్ ఆస్తుల డేటాను ఉమీద్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీలకు, ముతవల్లీలను కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వక్ఫ్ కమిటీ కార్యాలయం తగిన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. HYD నాంపల్లిలోని వక్ఫ్ కార్యాలయంలో ముతవల్లీలు, మేనేజ్‌మెంట్ కమిటీలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.