News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

Similar News

News April 13, 2026

తలుపులమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ప్రమాదం!

image

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన బి.కృష్ణ, రామలక్ష్మి దంపతులు తలుపులమ్మ లోవ దర్శనం ముగించుకుని వస్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వారిని ఎం.అప్పలరాజు అనే వ్యక్తి 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

image

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్‌ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి.

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.