News February 27, 2026
HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
Similar News
News April 14, 2026
33% రిజర్వేషన్: మారనున్న సమీకరణాలు

రాబోయే ఎన్నికల నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానుండటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 20కి పెరిగే అవకాశం ఉండగా, రిజర్వేషన్ల ప్రకారం అందులో 5-7 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. వీటిలో మహిళలకు కేటాయించే స్థానాలపై ఆసక్తి నెలకొంది. తమ స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయేమోనన్న టెన్షన్ నేతల్లో మొదలైంది.
News April 14, 2026
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.
News April 14, 2026
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్‌డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.


