News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

Similar News

News April 14, 2026

HYD: ఇన్ఫెక్షన్ పెరుగుతోంది.. జాగ్రత్త!

image

HYDలోని CCMB తాజా అధ్యయనంలో కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియాల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతున్నట్లు వెల్లడైంది. పరిశోధనలో 45% బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకంగా మారినట్లు గుర్తించారు. క్లెబ్సియెల్లా, న్యుమోనియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతుల్లో ఈ ప్రతిరోధక శక్తి ఎక్కువగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్‌ను తట్టుకోగల శక్తిగా మారాయని తేలింది.

News April 14, 2026

HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

image

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.