News May 4, 2024

HYD సిటీ కాలేజీలో ఇంటర్వ్యూలు

image

HYDలోని ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ప్రిన్సిపల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. బయో టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులని, పీహెచ్‌డీ, ఎం.ఫిల్, నెట్, స్లెట్ అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

Similar News

News January 22, 2026

HYD: 500 మందిని ఉరితీసింది ఇక్కడే

image

‘కాలాపానీ’ అనగానే అండమాన్ గుర్తుకొస్తుంది. కానీ దాని రూపకల్పనకు మన HYDలోని ఓ జైలు ఆధారమైందన్న విషయం చాలామందికి తెలియదు. దీనిని సికింద్రాబాద్ తిరుమలగిరిలో 1858లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. 20,344 గజాల విస్తీర్ణంలో పచ్చీస్ ఆకారంలో, 75 చీకటి గదులతో ఈ కారాగారాన్ని కట్టించారు. ఇందులో 500 మందికిపైనే ఉరేశారు. 1994 వరకు జైలుగా వినియోగించారు. దీనినే నమూనాగా తీసుకుని 1906లో ‘కాలాపానీ’ని నిర్మించారు.

News January 22, 2026

HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

image

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.

News January 22, 2026

HYD: మేడారం వెళ్తున్నారా..? 7658912300కి ‘HI’ పెట్టండి

image

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ