News April 2, 2024
HYD: ‘సిబ్బంది సగం.. తనిఖీలు తూచ్’

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు.
Similar News
News November 28, 2025
HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

హైదరాబాద్లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.