News August 20, 2024

HYD: సీఎంకు దండం పెడుతున్నా: మోత్కుపల్లి

image

SC వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆనందదాయకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, వయసులో నేను పెద్దవాడిని అయిన సీఎంకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్నారు.

Similar News

News September 19, 2024

HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.

News September 19, 2024

HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!

image

హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు‌ తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.

News September 18, 2024

HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.