News January 1, 2025
HYD: సీఎంను కలిసిన మంత్రులు, MLAలు, MPలు

జూబ్లీహిల్స్లోని తన నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కిరణ్ రెడ్డి, అనిల్ కుమార్, మల్లు రవి, ఎమ్మెల్యేలు, అద్దంకి దయాకర్ , కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్ చెల్లెలు అవ్ధీశ్ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్రాబ్సన్’ కోడ్తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.
News September 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
News September 17, 2025
HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.