News February 28, 2025
HYD: సీఎం రేవంత్‌తో రక్షణ శాఖ మంత్రి..

దేశ భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవార జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల సైన్స్ అండ్ టెక్నాలజీ మహోత్సవం విజ్ఞాన్ వైభవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉందని సీఎం అన్నారు.
Similar News
News March 1, 2025
తాండూర్: చిరుత పులి పిల్ల మృతి.. అధికారుల విచారణ

తాండూరు మండలం కోటబాస్‌పల్లి శివారులో నిన్న సాయంత్రం కొన ఊపిరితో కనిపించిన చిరుత పులి పిల్ల చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. జిల్లాలో మొన్నటి వరకు చిరుత పులి సంచారం ఆందోళన కలిగించగా.. తాజాగా పులి పిల్ల మృతి భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో పులి పిల్ల ఇక్కడి నుంచి వచ్చింది. ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేక అక్కడ చిరుత పులి పిల్లను జన్మనిచ్చిందా..? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
News March 1, 2025
వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రోకు రూ.50కోట్లు

వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
News March 1, 2025
మర్రిగూడ: లైంగిక దాడి కేసులో జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తికి 16నెలల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కులకర్ణి విశ్వనాథ్ తీరునిచ్చారు. వివరాలిలా.. మర్రిగూడ మండలం శివన్నగూడెంకి చెందిన నర్సిరెడ్డి 2017లో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. 16నెలల శిక్ష, రూ.1500 జరిమానా విధించారు.