News March 24, 2024

HYD: సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: ఆర్.కృష్ణయ్య

image

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం HYD విద్యానగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గవ్వల భరత్ పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.

News November 3, 2025

మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

image

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

News November 3, 2025

HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

image

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.