News June 29, 2024
HYD: సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి సవాల్..!
BRS మహిళా నేత, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహేశ్వరం ప్రాంతానికి రద్దు చేసిన రూ.250 కోట్లను తిరిగి మంజూరు చేయాలన్నారు. గత సర్కారు మంజూరు చేసిన పనులను రద్దు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Similar News
News October 16, 2024
షాబాద్ రావాలని మంత్రికి ఆహ్వానం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామదూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాబాద్ మండలం దివ్యదామం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలతో స్వామిజీలు మంత్రిని ఆశీర్వదించారు.
News October 16, 2024
BREAKING: HYD: దంపతుల దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2024
HYD: ‘మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ’
అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.