News June 11, 2024
HYD: సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

HYD అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులు షురూ అయ్యాయి. GHMC పరిధిలోని సుమారు వందకు పైగా కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో పాటు పారిశుద్ధ్యం, బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్, సీఆర్ఎంపీ, ఎస్సాఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ పనులపై దృష్టి సారించారు.
Similar News
News March 25, 2025
రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెడ్డిపల్లె, చుక్కాపూర్‌లో 37.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తోమ్మిదిరేకుల, ప్రొద్దుటూరు 37.3, మొయినాబాద్, మంగళ్‌పల్లి 37.2, కాసులాబాద్ 36.9, మొగలిగిద్ద 36.8, కేతిరెడ్డిపల్లి 36.7, కేశంపేట 36.6, ధర్మసాగర్, తుర్కయంజాల్, షాబాద్ 36.4, హస్తినాపురం, నాగోల్ 36.2, పేద్దషాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 25, 2025
రంగారెడ్డి: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 25, 2025
కేబినెట్ విస్తరణ.. హైదరాబాద్‌కు NO ఛాన్స్..!

మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.