News December 26, 2024

HYD సీపీ చేతనైతే ఆ పని చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు

image

ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 28, 2024

మెదక్: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శివంపేటలో 13.9, నల్లవల్లి 14.2, అల్గోల్, అంగడి కిష్టాపూర్ 14.9, అల్మాయిపేట 15.0, పుల్కల్ 15.1, కాగజ్ మద్దూర్, కంకోల్, కంది, పాశమైలారం 15.2 డిగ్రీలు నమోదయ్యాయి. చాలా చోట్ల పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడగా.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

News December 28, 2024

మెదక్: మాజీ ప్రధానికి మంత్రి పొన్నం నివాళి

image

ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టిన ఆయన నిరాడంబరతకు ఆదర్శం అన్నారు.

News December 27, 2024

కొల్చారం: SI సూసైడ్.. కారణం ఇదే..?

image

కామారెడ్డి జిల్లాలో నిన్న కొల్చారానికి చెందిన <<14983014>>SI <<>>సాయికుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మహిళ కానిస్టేబుల్‌తో ఉన్న పరిచయమే ఆయన మృతికి కారణంగా తెలుస్తోంది. సాయికుమార్ బీబీపేటలో SIగా పనిచేసేటప్పుడు కానిస్టేబుల్ శ్రుతితో పరిచయం ఏర్పడింది. ఈయన భిక్కనూర్‌కు బదిలీపై వెళ్లగా.. కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్‌ శ్రుతికి పరిచయం అయ్యాడు. కాగా, వీరి మధ్య ఏర్పడిన పరిచయమే మృతికి కారణంగా తెలుస్తోంది.