News December 9, 2024

HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్

image

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో కళాకారులు కూచిపూడి నృత్యప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. బుధవారం గురువు సుప్రియ శిష్యబృందం జయము జయము, శ్రీరంగనాథం, ముద్దుగారే యశోద, ఓం శర్వాణి, జయజయ దుర్గే, అన్నమాచార్య కీర్తనలు, శ్యామల మీనాక్షి, సీతా కళ్యాణం తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు చైత్ర, రూప, హరిణి, రిషిత, సమీక్షిత, శ్రీనిక, ప్రమీత, దక్ష, యుక్తశ్రీ, మోక్షిత పాల్గొన్నారు.

News November 19, 2025

HYD: సంస్థ అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరం: సీపీ

image

ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరమని సీపీ సజ్జనార్ అన్నారు. ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, ఈ శిక్షణ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు.

News November 19, 2025

HYD: శంషాబాద్‌లో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన HYD శంషాబాద్‌లో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వర్ధమాన్ కాలేజీలో చదువుతున్న రోహిత్(21), రామటెంకి సిద్ధార్థ(21) మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామంలో ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధార్థ అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాలైన రోహిత్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.