News July 6, 2024
HYD: సూర్యుడికి దూరంగా భూమి: సంచాలకులు శ్రీరఘునందన్

సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తోన్న భూమి శుక్రవారం అత్యంత దూరంగా వెళ్లిందని HYDలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు, అంతరిక్ష పరిశోధన నిపుణులు N.శ్రీరఘునందన్ తెలిపారు.HYDలో ఆయన మాట్లాడుతూ.. సూర్యుడికి దగ్గరగా ఉన్న రోజు (JAN 3, 2024)తో పోలిస్తే 50 లక్షల కిలో మీటర్ల దూరంగా ఉందన్నారు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ ఉంటుందనే భావన ఉందని, ఇందుకు విరుద్ధంగా JANలో ఉందన్నారు.
Similar News
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ఏఐ కెమెరాలతో నిఘా.!

ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వీటి ద్వారా డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఏఐ కెమెరాలు వీటిని పసిగట్టి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందిస్తాయి. తద్వారా ప్రమాదాలు తక్కువయ్యే అవకాశం ఉంది.
News December 6, 2025
HYD: అడ్డూ అదుపు లేకుండా థియేటర్ల దోపిడీ.!

HYD మహానగరంలో సినిమా థియేటర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. టికెట్ ధరతో సమానంగా.. కూల్ డ్రింక్స్, పాప్కాన్ పేరుతో దోచేస్తున్నారు. MRP ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో సినిమాకు వచ్చేవారు జేబులు గుల్లవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారు. థియేటర్లకు రావాలంటేనే మధ్యతరగతి కుటుంబం బెంబేలెత్తిపోతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
News December 6, 2025
హైదరాబాద్లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


