News April 10, 2025
HYD: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిసిన BRS బృందం

HCU కంచ గచ్చిబౌలి అటవీ భూములలో అక్రమంగా చెట్ల కొట్టివేతకు సంబంధించి 200 పేజీల నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ బృందం కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో CECని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్ కలిశారు. తెలంగాణ భవన్లో BRS బృందం మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News September 16, 2025
అన్నమయ్య: ‘బొప్పాయి తక్కువకు అడిగితే కాల్ చేయండి’

అన్నమయ్య జిల్లాలో సెప్టెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8లుగా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7లుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.
News September 16, 2025
పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ

పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ అయ్యారు. ఆయనను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శౌర్యమన్ పటేల్ శిక్షణ పూర్తయిన తరువాత పాడేరు సబ్ కలెక్టర్‌గా 2024 సెప్టెంబరులో నియమితులయ్యారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.