News April 10, 2025

HYD: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిసిన BRS బృందం

image

HCU కంచ గచ్చిబౌలి అటవీ భూములలో అక్రమంగా చెట్ల కొట్టివేతకు సంబంధించి 200 పేజీల నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ బృందం కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో CECని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్ కలిశారు. తెలంగాణ భవన్‌లో BRS బృందం మీడియాతో మాట్లాడనున్నారు.

Similar News

News July 9, 2025

VJA: ‘క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి’

image

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో అమరావతిలో 2 రోజుల పాటు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న తుళ్లూరు CHC, 11న యర్రబాలెం UHCలో ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్ నిర్ధారణ సేవలు, అవగాహన కార్యక్రమాలు ఈ క్యాంపుల ద్వారా అందిస్తున్నామని, స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.

News July 9, 2025

కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

image

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్‌లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.

News July 9, 2025

VJA: దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఈవో శీనా నాయక్ పర్యవేక్షిస్తున్నారు. నేడు ఎంతో వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయని, గంట గంటకు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోందని అధికారులు తెలిపారు.