News March 13, 2025

HYD సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

image

ప్రపంచంలోనే HYD సెంట్రల్ యూనివర్సిటీ అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్‌కు చెందిన QS సంస్థ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. 2025కి గానూ హెచ్‌సీయూ 7 సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.బీజేరావు మాట్లాడుతూ.. మరింత శ్రమించి హెచ్‌సీయూ ఉనికిని విస్తరిస్తామన్నారు.

Similar News

News December 1, 2025

GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

image

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.

News December 1, 2025

వరంగల్: రాజకీయ పార్టీల్లో వలసల జోరు!

image

రాజకీయ పార్టీల్లో వలసల జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. డబ్బు, మద్యం, పదవుల ఆశ చూపడంతో పార్టీల్లో చేరికల పరంపర కొనసాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కావడంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం పార్టీల్లోకి చేరికలు జరిగాయి.

News December 1, 2025

నేడు గీతా జయంతి

image

పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈరోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకొంటాం. ‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.