News June 11, 2024
HYD: సెక్రటేరియట్లో కొత్త రూల్స్ ఇవే..!
HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.
Similar News
News November 29, 2024
డిసెంబర్ 2న బాచుపల్లికి సీఎం రేవంత్
డిసెంబర్ 2న బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం భవన సముదాయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక మేయర్ నీలా గోపాల్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సభా స్థలి, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
News November 29, 2024
ప్రొస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ వాటర్ వెపర్ థెరపీతో చికిత్స
ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యకు ఆపరేషన్ లేకుండా వాటర్ వెపర్ థెరపీతో AINU హాస్పిటల్ చికిత్స అందిస్తోంది. అంగస్తంభన, వీర్యస్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలకు ఈ వాటర్ వెపర్ థెరపీతో సరైన పరిష్కారం లభిస్తుంది. ఇది చేసిన తర్వాత నెల రోజుల్లోపు ఫలితాలు కనిపిస్తాయని, ఈ సమస్యలు ఉన్నవారికి ఈ చికిత్స ఒక వరం లాంటిదని AINU ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు.
News November 29, 2024
HYD: అధికారులూ.. గుర్తుందా శీతాకాలం
HYD మహానగరంలో చాలామంది చలిలో వణుకుతూ ఫుట్‌పాత్‌పైనే పడుకుంటున్నారు. వారు చలికి ఇబ్బంది పడకూడదని జీహెచ్ఎంసీ గతంలో దుప్పట్లను పంపిణీ చేసేది. అయితే ఈసారి అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. కృష్ణానగర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, ఇందిరా నగర్, రెయిన్బో ఆస్పత్రి, సాగర్ సొసైటీ, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట ప్రాంతాల్లో వందల మంది ఫుట్‌పాత్‌పై చలిలో అవస్థలు పడుతున్నా పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.