News April 3, 2025

HYD: సెక్రటేరియట్ ముందు ఇదీ పరిస్థితి 

image

భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT

Similar News

News September 19, 2025

HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

image

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?

News September 19, 2025

HYD: మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

image

భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి PRT బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి MD అశోక్‌రెడ్డి ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో ఉ.6 నుంచి ఉ.9 గం. వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్‌హోల్ మూతలు తెరవొద్దని, ఒకవేళ తెరిచి ఉంటే HMWSSB 155313, హైడ్రా 9000113667 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

News September 19, 2025

సరూర్‌నగర్ చెరువులో దూకి సూసైడ్

image

సరూర్‌నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.