News January 23, 2025
HYD: సెక్రటేరియేట్కు వెళ్లే టూరిస్టులపై ఆంక్షలు

సచివాలయంకు వచ్చే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై సచివాలయం లోపలకి వెళ్లేవారికి ఇచ్చే పాసుతో ఒక్కరిని మాత్రమే అనుమతినిస్తామని తెలిపింది. సీఎస్ ఫ్లోర్లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతోపాటు.. సందర్శకుల సంఖ్యను తగ్గించాలని SPF సిబ్బంది కోరడంతో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
సికింద్రాబాద్: ఆ ట్రైన్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోరఖ్పుర్ ట్రైన్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరం నుంచి గోరఖ్పుర్కు వీక్లీ ట్రైన్ ప్రయాణికులకు సేవలందించేది. అయితే నవంబర్ 28 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ రైలు (07075- 07076)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.
News October 21, 2025
HYD: ప్రభుత్వం వద్దకు మెట్రో.. సిబ్బందిలో టెన్షన్..!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1,300 మంది రెగ్యులర్ స్టాఫ్, 1,700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెట్రో రైల్ నిర్వహించే ఎల్ అండ్ టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న స్టాఫ్ తమ పరిస్థితి ఏమిటో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
News October 21, 2025
BREAKING: HYD: అల్కాపురి టౌన్షిప్లో యాక్సిడెంట్

HYD పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్షిప్లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.