News July 7, 2024
HYD: సెక్రెటేరియేట్ ముట్టడికి నిరుద్యోగులకు పిలుపు: R.కృష్ణయ్య

తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ ఆధ్వర్యంలో జులై 15న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తున్నామని ఎంపీ R.కృష్ణయ్య, బీసీ జన సభ చీఫ్ రాజారాం యాదవ్, కొంపెల్లి రాజు తెలిపారు. ఈరోజు వాల్ పోస్టర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, అందరం కలిసి పోరాటం చేసి తమ సత్తా ఏంటో సీఎంకు చూపిస్తామన్నారు.
Similar News
News November 17, 2025
కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 17, 2025
HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


