News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

Similar News

News July 10, 2025

ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

image

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్‌, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.

News July 10, 2025

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

image

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.

News July 10, 2025

వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

image

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.