News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి కోర్టు ఏర్పాటు వివాదం.. సుల్తానాబాద్ న్యాయవాదుల ఆగ్రహం

పెద్దపల్లి జిల్లా కోర్టును పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విజయరమణరావును కలిసి వినతిపత్రం ఇచ్చిన న్యాయవాదులను ఎమ్మెల్యే అవమానించారనే ఆరోపణలతో సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతిరెడ్డి, కార్యదర్శి భూమయ్యతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
News November 24, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* ధర్మేంద్ర మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు, రేవంత్, పవన్
* రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ పార్టీలో చేరా.. NTR చలవతోనే అవినీతిమయ రాజకీయాల్లోనూ రాణిస్తున్నా: మంత్రి తుమ్మల
* గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై జీవో 46ను ఉపసంహరించుకోవాలన్న బీసీ సంఘాలు.. ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు చేయాలని తీర్మానం
* నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 331, నిఫ్టీ 108 పాయింట్లు దిగువకు
News November 24, 2025
మంథనిలో మహిళా సాధికారతపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్

మంథని ఎక్లాస్పూర్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. VIATRIS సాయంతో 21 కుట్టు కేంద్రాలు, 850 మిషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కుట్టు కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి యూనిట్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.


