News March 24, 2025
HYD: సైబర్ నేరగాలపై టీజీసీఎస్బీ కీలక సూచన

HYD: కార్పొరెట్ కంపెనీల్లో అన్లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ శిఖా గోయల్ తెలిపారు. గోయల్ మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారన్నారు.
Similar News
News March 26, 2025
రేపు ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

రేపు ఉప్పల్ వేదికగా SRH VS LSG మ్యాచ్ కోసం TGSRTC స్పెషల్ బస్సులను నడుపుతోంది. 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను స్టేడియానికి తిప్పనున్నారు. ఉప్పల్, చెంగిచెర్ల, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మిధాని, బర్కత్పురా, కాచిగూడ, ముషీరాబాద్, దిల్సుఖ్నగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, మేడ్చల్, మియాపూర్, కంటోన్మెంట్, హఫీజ్పేట, రాణిగంజ్, ఫలక్నుమా, మెహదీపట్నం, HCU తదితర డిపోల బస్లు అందుబాటులో ఉంటాయి.
SHARE IT
News March 26, 2025
చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.