News May 26, 2024
HYD: సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ఇవ్వండి, లేకుంటే వారు మీకు మిగలరని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News November 28, 2024
HYD: వర్ణ వివక్షతపై ఫులే అలుపెరగని పోరాటం చేశారు: KTR
మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆ మహానీయుడి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫులే కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
News November 28, 2024
HYD: కాంగ్రెస్ను బద్నాం చేద్దామని BRS ప్లాన్: కల్వ సుజాత
BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
News November 28, 2024
HYDకు వచ్చిన డేంజర్ గ్యాంగ్.. పోలీసుల క్లారిటీ
వీధుల్లో లేడీస్ సూట్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా హైదరాబాద్కు వచ్చిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు నగరానికి వచ్చారని పలువురు సోషల్ అకౌంట్లలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలను వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
SHARE IT