News April 19, 2024
HYD: సైబర్ నేరాల పై ఫిర్యాదు చేయటం ఇక ఈజీ!
రోజు రోజుకి 1930 సైబర్ హెల్ప్ లైన్ కాల్స్ పెరగటం, లైన్ బిజీ రావటం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేసి, వెంటనే స్పందించేందుకు ప్రతి స్టేషన్ పరిధిలోని సైబర్ యోధులకు(సైబర్ క్రైమ్ కానిస్టేబుల్) ప్రత్యేక సెల్ ఫోన్లు అందిస్తున్నారు. HYD, RR, MDCL, VKB జిల్లాలోనూ ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే వికారాబాద్‌లోని పలు స్టేషన్లలో అందజేశారు. 1930కు కాల్ చేసిన వెంటనే స్పందించి, సైబర్ నేరాలపై చర్యలు తీసుకోనున్నారు.
Similar News
News September 8, 2024
HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ
హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.
News September 8, 2024
ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 8, 2024
HYD: నయా మోసం.. నమ్మితే నట్టేట మునిగినట్టే!
HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.