News March 15, 2025

HYD: సైబర్ మోసం.. రూ.1.95 కోట్ల రికవరీ..!

image

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ నేరగాళ్ల చేతిలో నుంచి రూ.1.95 కోట్లను రికవరీ చేసింది. HYDలోని ఓ వ్యాపారికి చెందిన ఖాతా నుంచి ఈ మొత్తాన్ని మోసగాళ్లు తరలించారు. కొత్త ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ పేరుతో నకిలీ అకౌంట్‌కు డబ్బు పంపాలని ఓ ప్రత్యేక సందేశం పంపించి కాజేశారు. దీన్ని గుర్తించిన ఆ వ్యాపారి సంబంధించిన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రికవరీ చేశారు.

Similar News

News November 22, 2025

పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

image

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.

News November 22, 2025

పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

image

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

News November 22, 2025

సిరిసిల్ల జిల్లాలో మహిళా ఓటర్లు.. ఎందరంటే..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11,787 అధికంగా ఉన్నాయి. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డుల పరిధిలో 3,53,351 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,70,772 మంది పురుషులు, 1,82,559 మంది మహిళలు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 40,886 మంది ఓటర్లు ఉండగా, వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 11,727 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆదివారం పూర్తికానుంది.