News August 19, 2024

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో అర్హులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 30లోపు www.nacsindia.org సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News February 26, 2026

HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

image

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

News February 26, 2026

HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

image

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.

News February 26, 2026

GHMC: నిధుల విభజన వేళ రూ.300 కోట్ల దోపిడీ?

image

GHMC నిధుల విభజన కసరత్తు వేళ వ్యవస్థీకృత దోపిడీపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ డోర్ నంబరింగ్ పేరిట ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సర్వర్లకు మళ్లుతోంది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలో బాగున్న రోడ్లనే కూల్చి వేస్తూ ‘సిండికేట్ కాంట్రాక్టర్లు’ ఏటా రూ.300 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. హరితహారం ‘గోస్ట్ ఆడిట్’ వెనుక బినామీల బాగోతంపై విజిలెన్స్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.