News August 19, 2024
HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో అర్హులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 30లోపు www.nacsindia.org సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 12, 2024
HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!
రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.
News September 11, 2024
HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్
హైదరాబాద్ మెట్రోలో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?
News September 11, 2024
హైదరాబాద్: మందు తాగితే నో ఎంట్రీ!
HYDలో గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. బుధవారం 5వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు సాయంత్రం భారీ జులూస్ నడుమ ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్ ప్లాజా ఎదుట క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మరేదైనా మత్తు పదార్థాలు తాగిన వ్యక్తులను అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలన్నారు.
SHARE IT