News August 10, 2024
HYD: సైరన్లతో ఫేక్ అంబులెన్స్‌లు.. తనిఖీలు!

HYD మహా నగరంలో సైరన్లతో వెళ్లే ఫేక్ అంబులెన్స్‌లపై అధికారులు ఫోకస్ పెట్టారు. బోయిన్పల్లి మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు ప్రవేశించిన పలు జిల్లాలకు చెందిన ఫేక్ అంబులెన్స్‌లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. 38కి పైగా సైరన్ మోగిస్తూ ఫేక్ అంబులెన్స్ వాహనాలను అధికారులు గుర్తించారు.
Similar News
News November 5, 2025
BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
News November 5, 2025
HYD: పులులను లెక్కించాలని ఉందా.. మీ కోసమే!

దేశంలో పులుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది జనవరిలో(17- 23 వరకు) ప్రభుత్వం పులుల గణన చేపట్టనుంది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే రోజుకు 10- 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతేకాక మీ వయసు 18- 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలి. వివరాలకు 040-23231440 నంబరుకు ఫోన్ చేయండి.
News November 5, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో నేడు దీపోత్సవం

కార్తీక పౌర్ణమి వేడుకలు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సా.6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని టెంపుల్ ఈవో శేఖర్ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనన్నారు.


