News February 23, 2025

HYD: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

image

అన్న, చెల్లెని గర్భవతిని చేసిన ఘటన HYDలో జరిగింది. బాధితుల వివరాలు.. ప్రకాశం(D)కు చెందిన భార్యభర్తలకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విడాకులు తీసుకుని తల్లి, కుమార్తెలు విజయవాడలో, తండ్రి, కొడుకు HYDలో ఉంటున్నారు. పెద్ద చెల్లిని క్రిస్మస్‌కు సొంతూరు తీసుకెళ్లి తల్లికి అప్పజెప్పకుండా HYDకు వచ్చారు. కొన్నాళ్లకు కుమార్తె గర్భవతి అని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకొచ్చింది.

Similar News

News September 18, 2025

HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

image

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్‌ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.