News June 12, 2024

HYD: స్కూల్స్‌ రీఓపెన్.. జూన్ 19 వరకు బడిబాట

image

హైదరాబాద్ జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 768 ప్రభుత్వ పాఠశాలల్లో 1,34,478 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే పుస్తకాలు, నోట్ బుక్స్ 100 శాతం పంపిణీ చేశామని హైదరాబాద్ DEO రోహిణి తెలిపారు. యూనిఫామ్లను కూడా పంపించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుందని వెల్లడించారు.

Similar News

News November 16, 2025

రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

image

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2

News November 16, 2025

బలమైన లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా: అక్బరుద్దీన్

image

‘ప్రజాభిమానంతో నేను ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా సేవచేశా.. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి.. ఈ క్రమంలో బాగా అలసిపోయా..రెస్ట్ తీసుకుంటా..’ అని చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ మనసులోమాట వెల్లడించారు. ఓల్డ్ సిటీలో జరిగిన ఓకార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పిల్లల అభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేశాను.. నా స్థానంలోకి ఎవరైనా బలమైన నాయకుడు వస్తే నేను తప్పుకొని ప్రశాంత జీవనం గడుపుతా’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

image

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు  ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.