News February 7, 2025
HYD: స్కూల్ పిల్లల డేంజర్ జర్నీ
నిబంధనలు పాటించని స్కూల్ వ్యాన్లపై RTA అధికారులు <<15385435>>తనిఖీలు<<>> చేపట్టి సీజ్ చేస్తుంటే, మరికొందరు ఇవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓమ్నీ వెహికల్లో ఓ డ్రైవర్ ఏకంగా 25 మందిని ఎక్కించాడు. నాదర్గుల్ నుంచి బడంగ్‌పేటకు వెళ్లే రూట్లో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులను ఇలా తీసుకెళ్లడం ఏంటని స్థానికులు నిలదీశారు. వ్యాన్ మీద, డోర్లు ఓపెన్ చేసి ప్రమాదకరంగా తరలించడం గమనార్హం.
Similar News
News February 7, 2025
CSR సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
ఈనెల 16న శిల్పకళావేదికలో జరిగే సౌత్ ఇండియా CSR సమ్మిట్ పోస్టర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సమ్మిట్‌లో వెయ్యి కార్పొరేట్ సంస్థలు, 2వేల మంది NGO’S, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్‌ల ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 50 కేటగిరిల్లో సేవా అవార్డులు ఇవ్వనున్నారు. సమ్మిట్ లైసెన్సీ వినీల్ రెడ్డి, TDF ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
News February 7, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య
బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.
News February 7, 2025
నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం
రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్షా కోట్లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.